తీగారంలో పర్యటించిన ఎంపీడీవో
JN: పాలకుర్తి మండలం తీగారం గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌ను ఎంపీడీవో వేదవతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి పాఠశాల స్థితిగతులను, వారి విద్య సామర్ధ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు మొదలగు వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.