కేశవాపూర్లో విషాదం.. ఇద్దరు కుమార్తెలు అనాథలు

కేశవాపూర్లో విషాదం.. ఇద్దరు కుమార్తెలు అనాథలు

SDPT: అక్కన్నపేట (M) కేశవాపూర్లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా నిన్న తల్లి తలపాక కనకవ్వ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. తల్లి మృతితో అక్కాచెల్లెళ్లు రోదిస్తున్న దృశ్యం గ్రామస్థులను కలచివేసింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో జీపీ పాలకవర్గం, గ్రామస్థులు చందాలు వేసి కార్యక్రమం నిర్వహించారు.