ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద పెన్సనర్ల ధర్నా

ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద పెన్సనర్ల ధర్నా

కోనసీమ: పెన్సనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 25న నిరసన చేపడతామని పెన్సనర్ల జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం యూటీఎఫ్ హోమ్‌లో ఆయన మాట్లాడుతూ.. కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.