VIDEO: 'పిడకల సమరం' చూశారా?
AP: కర్నూలు జిల్లా కైరుప్పలలో సంప్రదాయబద్ధంగా ‘పిడకల సమరం’ నిర్వహించారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలు విసురుకుంటూ సందడి చేశారు. అటు కల్లూరులో చౌడేశ్వరిదేవి ఆలయం వద్ద బంకమట్టితో బురద చేసి, ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేస్తూ ‘రైతుల పండుగ’ను ఘనంగా జరుపుకున్నారు. రైతు, మట్టికి మధ్య సంబంధానికి గుర్తుగా ఏటా ఇలా చేస్తుంటారు.