VIDEO: భక్తులతో కిటకిటలాడిన కసాపురం ఆలయం

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. చివరి శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.