ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవార్డు
ADB: తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యాశాఖ నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టుకు ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి తెలుగు విభాగంకు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చిందని ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్త తెలిపారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో కళాశాల అధ్యాపకులకు ఆమె రూ. 12 నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.