మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

KNR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యాధికారులు, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లతో సమావేశ కార్య క్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు.