'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
KKD: రైతుల్ని రాజులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఆలోచన అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో జరిగిన 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ పైడిపాల సూరిబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి 'రైతన్న మీకోసం' పత్రాలు పంచారు.