AITP బస్సు యజమానులతో మంత్రి వీడియో సమావేశం

AITP బస్సు యజమానులతో మంత్రి వీడియో సమావేశం

అన్నమయ్య: మంత్రి రాంప్రసాద్ AITP బస్సు యజమానుల సంఘంతో వీడియో సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలలో నమోదైన 700–800 బస్సులను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడానికి ప్రోత్సహిస్తూ, త్రైమాసిక పన్నును సీటుకు రూ.4000 నుంచి రూ.2500కు తగ్గిస్తామని తెలిపారు. బస్సుల భద్రత, ఫిట్‌నెస్‌పై కఠిన తనిఖీలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.