VIDEO: ఎస్పీ ఎదుట లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు
ASR: ఛత్తీస్‌గఢ్ సౌత్ బస్తర్‌కు చెందిన నలుగురు ఏసీఎం స్థాయి మావోయిస్టులు పాడేరులో ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట లొంగిపోయారు. మడవి కోస, నంద, సంగీత, మడియం లక్కు జనజీవన స్రవంతిలో కలిశారు. వీరు పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 52 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని ఆయన వెల్లడించారు.