MLAలకే టోకరా.. UPSC ర్యాంక్ అని నమ్మించి పరార్
బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే కూలీ UPSC ఫలితాల్లో 440వ ర్యాంక్ సాధించానని అందరికీ చెప్పాడు. దీంతో ఎమ్మెల్యేలు, పోలీసులు సైతం అతడిని సత్కరించారు. అయితే అది అతడి ర్యాంకు కాదని, కర్ణాటకకు చెందిన మరో రంజిత్‌దని తేలింది. ఫొటోషాప్‌తో ర్యాంక్ కార్డు సృష్టించి అందరినీ నమ్మించాడు. ప్రస్తుతం ఈ ఫేక్ ర్యాంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.