ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందిస్తాం.. ఎమ్మెల్యే

SKLM: ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం పలాస మండలం తర్లాకోటలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. సుమారు 59 లక్షల రూపాయలతో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.