భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు

ADB: భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు ITDA పీఓ, విద్యాశాఖ అధికారి ఖుష్బూ గుప్తా బుధవారం తెలిపారు. ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, సోనాల మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు లోకల్ హాలీడే ప్రకటించినట్లు వెల్లడించారు. విద్యార్థులు నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు.