VIDEO: భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజాము నుంచి స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఈవో దుర్గ భవాని తెలిపారు.