ప్రధాన రహదారిపై రెండు బైకులు ఢీ
VZM: కొత్తవలస-అరకు ప్రధాన రహదారి మంగళపాలెం శివాలయం వద్ద సోమవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పెందుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.