పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి: ఎంపీడీవో
AKP: మండలంలోని పంచాయతీలకు నియమితులైన ప్రత్యేకాధికారులు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపీడీవో ఎం.ఎస్.శ్రీనివాస్ సూచించారు. నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీల్లో మంచినీటి సరఫరా, పారిశుద్య నిర్వహణపై తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.