మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ
SRPT: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు సూర్యాపేటలో సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర పార్టీల పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో బరిలోకి దిగుతామని పేర్కొన్నారు.