ప్రభుత్వానికి ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి
ATP: రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను ప్రస్తుతం ఉన్న అనంతపురం, ధర్మవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోనే యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీసీఎల్ఏ కమిషనర్‌లకు లేఖ రాశారు. ఒకే డివిజన్‌గా మార్చితే ప్రజలు 85 కి.మీ వరకు ప్రయాణించాల్సి వస్తుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.