'పంట పొలాలను బంజరు భూములంటారా'

'పంట పొలాలను బంజరు భూములంటారా'

NLR: ఉలవపాడు(M) కరేడు రైతుల ఉద్యమానికి మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు తెలిపారు. కరేడులో పర్యటించిన ఆయన అక్కడి రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని కీలో మీటర్ల మేర కనువిందు చేస్తున్న పచ్చని పైర్లను చూసి ఆశ్చర్యపోయారు. 20 అడుగుల లోతులో మంచినీటితో సస్యశ్యామలంగా ఉన్న పంట భూములను బంజరు భూములంటూ పరిశ్రమలకు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.