'గ్రామ సమీపంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
NRML: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం సమావేశంలోకొనుగోలు కేంద్రాలను గ్రామ సమీపంలో ఏర్పాటు చేయాలని, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయో ముందుగా పరిశీలించాలని సూచించారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.