కిరాణా షాపులో చైన్ స్నాచింగ్ కలకలం
TG: నిజామాబాద్ చంద్రనగర్‌లో చైన్ స్నాచర్లు బరితెగించారు. ఓ కిరాణా షాపులోకి 'విక్స్' కావాలంటూ కస్టమర్‌లా వచ్చిన దొంగ, ఒంటరిగా ఉన్న మహిళను నమ్మించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. బాధితురాలు తేరుకునేలోపే దుండగుడు పరారయ్యాడు. ఈ దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.