VIDEO: స్పీకర్‌తో మర్యాదపూర్వక భేటీ

AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ పుట్టినరోజును తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవం దినంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడును కోరారు. దీనిపై స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.