రైతులకు అండగా ప్రభుత్వం: మాజీ ఎంపీపీ
NGKL: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు అన్నారు. ఇవాళ జనుంపల్లిలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలన్నారు.