టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రజా దర్బార్
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వినతులను ఆయన ఓపిగ్గా స్వీకరించి, వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చి, సంబంధిత అధికారులకు అందజేశారు.