'శిశువు విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు'
NLG: శిశువు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మహిళ శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి ఆదేశాల ప్రకారం శుక్రవారం మండలంలోని చలకుర్తి సెక్టార్ పరిధిలోని రామన్నగూడెం తండాలో అంగన్వాడీ టీచర్లకు శిశు విక్రయాలు జరుగకుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.