అర్ధవీడులో రేపు పవర్ కట్
ప్రకాశం: అర్థవీడులో మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.