ఎరువుల దుకాణాల్లో పోలీసులు తనిఖీ

ఎరువుల దుకాణాల్లో పోలీసులు తనిఖీ

ప్రకాశం: త్రిపురాంతకంలోని ఎరువుల దుకాణాల్లో CI హసన్, SI శివబసవరాజు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. యూరియా కొరత, బ్లాక్ అమ్మకాలపై వారు రికార్డులను పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు అమ్మితే, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. కాగా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.