ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన MEO
SRD: సిర్గాపూర్ వాసర్ ప్రాథమిక పాఠశాలను MEO నాగారం శ్రీనివాస్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న FLN బోధన విధానంను పరిశించి, పిల్లల ప్రగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, గణితం ఎలా అమలు అవుతున్నది పరిశీలించారు. అనంతరం MDM వారితో మాట్లాడి, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు ఇవ్వాలన్నారు.