VIDEO: నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత

NLG: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.90 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు సోమవారం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తివేతతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.