VIDEO: పంచాయతీ ఎన్నికల వేళ.. బస్సుల్లో కిక్కిరిసిన జనం
MHBD: తొర్రూరు మండల వ్యాప్తంగా నేడు జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. చలిని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో సహా పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్నారు. దీంతో తొర్రూరు డివిజన్ కేంద్రం నుంచి నర్సంపేట, మహబూబాబాద్, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి.