ర్యాలపల్లి సర్పంచ్గా అనసూర్య ఘన విజయం
KNR: గంగాధర మండలంలోని ర్యాలపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో దానే అనసూర్య ఓదెలు సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 229 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామ సమస్యలను తీరుస్తానని అనసూర్య హామీ ఇచ్చారు.