జిల్లా స్థాయి వంటల పోటీలు
మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరులోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జిల్లా స్థాయి వంటల పోటీలు ఘనంగా జరిగాయి. హన్వాడ, మిడ్జిల్, మహబూబ్ నగర్ అర్బన్ రూరల్ మండలాల వివిధ పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు వివిధ రకాల వంటలతో పోటీలో పాల్గొన్నారు. ఎంఈవో కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనం అందివ్వాలని సూచించారు.