CMRF చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు సోమవారం రాత్రి ఆయన క్యాంప్ కార్యాలయంలో 97 మంది లబ్ధిదారులకు రూ.49,27,575 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి సాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే యార్లగడ్డకు కృతజ్ఞతలు తెలిపారు.