జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు
ములుగు: జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడలను డీడబ్ల్యూఓ తుల రవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులలో మనోధైర్యాన్ని పెంచడానికి ఈ క్రీడలు ఎంత దోహదపడతాయని, క్రీడలలో గెలుపొందిన వారికి డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేస్తామన్నారు.