NTR జిల్లాలోకి గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలు!
AP: గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను NTR జిల్లాలో కలిపే ప్రతిపాదనలు కేబినెట్ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా 2 కొత్త జిల్లాలతో పాటు పీలేరు, అద్దంకి, మడకశిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.