'జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది'
కోనసీమ: జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావులపాలెం గ్రామానికి చెందిన వరద సుధీర్ కుటుంబాన్ని మంగళవారం బండారు శ్రీనివాస్ పరామర్శించారు. పార్టీ నుంచి మంజూరైన భీమా రూ. 5,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.