CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
VZM: ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన మొత్తం 11 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ త్వరగా నిధులు అందేలా కృషి చేస్తామని తెలిపారు.