VIDEO: 'పది ఎకరాలకు రెండు బస్తాలు ఇస్తే ఎలా'..?

MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో రైతుకు కేవలం మూడు బస్తాల యూరియా ఇస్తుండడంతో 5-10 ఎకరాలు సాగు చేసే రైతులు పంటల నష్టం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రేషన్ కార్డు ఉన్నవారికి మూడు బస్తాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.