ద్వజారోహణంతో మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ద్వజారోహణంతో మొదలైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కడప: జమ్మలమడుగు పట్టణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి నవమి బ్రహ్మోత్సవాలు ఆదివారం మొదలయ్యాయి. ఈరోజు ఉదయం వేద పండితులు బ్రహ్మోత్సవాలకు ద్వజారోహణంతో అంకురార్పణ చేశారు. ఈరోజు మొదలుకొని 11 రోజులపాటు నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈనెల 16న స్వామివారి కళ్యాణం, 17న రథోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.