పాఠశాల పైకప్పు నిర్మాణానికి పరిటాల శ్రీరామ్ హామీ
సత్యసాయి: ముదిగుబ్బ మండలం దొరిగల్లులో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూసి ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పందించారు. పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారని తెలుసుకున్న ఆయన ఆదివారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. తన సొంత ఖర్చుతో పాఠశాలపై కప్పు నిర్మాణం చేపడతానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.