పశువులకు వ్యాధి నిరోధక టీకాలు
SRD: కంగ్టి మండలం దేగుల్ వాడిలో ఆదివారం పశువుల వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మండలం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కంగ్టి లైవ్ స్టాక్ అసిస్టెంట్ (LSA) బసయ్య స్వామి, ఉప సర్పంచ్ మోహన్ కలిసి టీకాల కార్యక్రమం ప్రక్రియను ప్రారంభించారు. గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ఇచ్చారు. రైతులు కిష్టారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.