ధర్మారం సర్పంచ్‌గా స్రవంతి వెంకటేష్ విజయం
SDPT: జగదేవపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ధర్మారం గ్రామం సర్పంచిగా బీఆర్ఎస్ అభ్యర్థి జుర్రు స్రవంతి వెంకటేష్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పిట్టల సంతోష నరసింహులు మీద 86 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తనను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.