UPDATE: 'అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది'
HYD: బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై కింగ్ కోఠి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సంతోష్, వైద్యులు మాట్లాడుతూ.. విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.