సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ
KNR: సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు దేవకరి రంజిత్ రావుకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్‌కు సంబంధించిన రోటవేటర్‌ను గ్రామ సర్పంచ్ మెడవేని గోపాల్, ఏఈవో తిరుపతి రైతుకు అందజేశారు. ప్రభుత్వం అందించే రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.