కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్ సర్పంచ్..!
NZB: మాక్లూర్ మండలం మెట్టు గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి గాజుల నవీన్ కాళి, ఉప సర్పంచ్ బత్తుల వినయ్ సాగర్, వార్డుసభ్యులు మంగళవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.