VIDEO: పెరిగిన మిర్చి ధరలు... ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.21,600, నాన్ ఏసీ మిర్చి ధర రూ.22,000, అటు క్వింటా పత్తి ధర రూ.8,300గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.100, నాన్ ఏసీ మిర్చి ధర రూ.300 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారులు తెలిపారు.