రోడ్లపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలి

రోడ్లపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలి

NDL: రోడ్లపై గుంతలను పూడ్చి రోడ్డుకు ఇరువైపుల కంపచెట్లను తొలగించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అధికారులను డిమాండ్ చేశారు. పాములపాడు మండలం వేంపెంట - బానకచర్లకు వెళ్లే దారి గుంతల మయంగా మారిందని, రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.