తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
TPT: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 69,649 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,644 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా నమోదైంది.