ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

KNR: శంకరపట్నం మండలం కాచాపూర్ రైతు వేదికలో ఐదు రోజులుగా నిర్వహించిన గ్రామపంచాయతీ వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ శనివారం ముగిసింది. గ్రామాల అభివృద్ధి, నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించామని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీవో ప్రభాకర్, సర్పంచ్లు పాల్గొన్నారు.