గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి మృతి

PLD: గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన భాస్కరాచారి (45) మంగళవారం ఎలక్ట్రికల్ పని నిమిత్తం గురజాల వెళ్లారు. బస్టాండ్ సెంటర్లో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.